Logo

యెహెజ్కేలు అధ్యాయము 41 వచనము 19

1రాజులు 6:29 మరియు మందిరపు గోడలన్నిటిమీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను.

1రాజులు 6:30 మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను.

1రాజులు 6:31 గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవ భాగము వెడల్పు ఉండెను.

1రాజులు 6:32 రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను.

1రాజులు 7:36 దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పలకలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటునుబట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను.

2దినవృత్తాంతములు 3:7 మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడలమీద కెరూబులను చెక్కించెను.

యెహెజ్కేలు 40:16 కావలి గదులకును గుమ్మములకు లోపలవాటికి మధ్యగా చుట్టునున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడియుండెను.

యెహెజ్కేలు 40:22 వాటి కిటికీలును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.

ప్రకటన 7:9 అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలుచేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొఱ్ఱపిల్ల యెదుటను నిలువబడి

యెహెజ్కేలు 1:10 ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.

యెహెజ్కేలు 10:14 కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖములుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.

యెహెజ్కేలు 10:21 ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్కలును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.

ప్రకటన 4:7 మొదటి జీవి సింహము వంటిది; రెండవ జీవి దూడ వంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖమువంటి ముఖము గలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజు వంటిది.

ప్రకటన 4:8 ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.

ప్రకటన 4:9 ఆ సింహాసనమునందు ఆసీనుడై యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా

నిర్గమకాండము 25:18 మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.

1రాజులు 7:29 జవల మధ్యనున్న ప్రక్క పలకలమీద సింహములును ఎడ్లును కెరూబులును ఉండెను; మరియు జవలమీద ఆలాగుండెను; సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండలవంటి పని కలిగియుండెను.