Logo

యెహెజ్కేలు అధ్యాయము 43 వచనము 7

లేవీయకాండము 1:1 యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.

యెషయా 66:6 ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.

ప్రకటన 16:1 మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.

యెహెజ్కేలు 40:3 అక్కడికి ఆయన నన్ను తోడుకొనిరాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడివలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేతపట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.

యెహెజ్కేలు 9:1 మరియు నేను చెవులార వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను ఒక్కొకడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను.

ప్రకటన 1:12 ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.