Logo

యెహెజ్కేలు అధ్యాయము 46 వచనము 11

2సమూయేలు 6:14 దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను.

2సమూయేలు 6:15 ఈలాగున దావీదును ఇశ్రాయేలీయులందరును ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.

2సమూయేలు 6:16 యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులువేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.

2సమూయేలు 6:17 వారు యెహోవా మందసమును తీసికొనివచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.

2సమూయేలు 6:18 దహనబలులను సమాధానబలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి,

2సమూయేలు 6:19 సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీ పురుషులకందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.

1దినవృత్తాంతములు 29:20 ఈలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.

1దినవృత్తాంతములు 29:22 ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.

2దినవృత్తాంతములు 6:2 నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి

2దినవృత్తాంతములు 6:3 రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.

2దినవృత్తాంతములు 6:4 మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.

2దినవృత్తాంతములు 7:4 రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి.

2దినవృత్తాంతములు 7:5 రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱలను బలులుగా అర్పించెను; యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరును నిలిచియుండగను

2దినవృత్తాంతములు 20:27 ఈలాగున యెహోవా వారి శత్రువులమీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్లిరి;

2దినవృత్తాంతములు 20:28 వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచువచ్చిరి.

2దినవృత్తాంతములు 29:28 అంతసేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి, దహనబలి యర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను.

2దినవృత్తాంతములు 29:29 వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్న వారందరును తమ తలలు వంచి ఆరాధించిరి.

2దినవృత్తాంతములు 34:30 వారిని సమకూర్చెను. రాజును, యూదా వారందరును, యెరూషలేము కాపురస్థులును, యాజకులును, లేవీయులును, జనులలో పిన్నపెద్దలందరును యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరకిన నిబంధన గ్రంథపు మాటలన్నియు వారికి వినిపింపబడెను.

2దినవృత్తాంతములు 34:31 పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.

నెహెమ్యా 8:8 ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.

నెహెమ్యా 8:9 జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.

కీర్తనలు 42:4 జనసమూహముతో పండుగచేయుచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషముకలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసికొనగా నా ప్రాణము నాలో కరగిపోవుచున్నది.

కీర్తనలు 122:1 యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.

కీర్తనలు 122:2 యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి

కీర్తనలు 122:3 యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు

కీర్తనలు 122:4 ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమునుబట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.

మత్తయి 18:20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.

మత్తయి 28:20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

హెబ్రీయులకు 3:6 అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.

హెబ్రీయులకు 4:14 ఆకాశమండలము గుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.

హెబ్రీయులకు 4:15 మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

హెబ్రీయులకు 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము.

ప్రకటన 2:1 ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా