Logo

యెహెజ్కేలు అధ్యాయము 47 వచనము 19

ఆదికాండము 31:23 అతడు తన బంధువులను వెంటబెట్టుకొని, యేడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి, గిలాదు కొండమీద అతని కలిసికొనెను.

ఆదికాండము 31:47 లాబాను దానికి యగర్‌ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.

సంఖ్యాకాండము 32:1 రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని

న్యాయాధిపతులు 10:8 వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపుర మున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి.

ఆదికాండము 13:10 లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమై యుండెను.

యోబు 40:23 నదీప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటి ప్రవాహము పొంగి దానినోటియొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు.

సంఖ్యాకాండము 34:3 మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా

యెహోషువ 15:2 దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణదిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను.

యెహెజ్కేలు 39:11 ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు.

యోవేలు 2:20 మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పారదోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లువాసన కొట్టును.

జెకర్యా 10:10 ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశములోనికిని వారిని తోడుకొని వచ్చెదను.