Logo

యెహెజ్కేలు అధ్యాయము 48 వచనము 26

ఆదికాండము 30:14 గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా

ఆదికాండము 30:15 ఆమెనా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను.

ఆదికాండము 30:16 సాయంకాలమందు యాకోబు పొలమునుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నాయొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.

ఆదికాండము 30:17 దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.

ఆదికాండము 30:18 లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.

యెహోషువ 19:17 నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.

యెహోషువ 19:18 వారి సరిహద్దు యెజ్రె యేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను

యెహోషువ 19:19 అబెసు రెమెతు ఏన్గన్నీము

యెహోషువ 19:20 ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు

యెహోషువ 19:21 సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు

యెహోషువ 19:22 అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.

యెహోషువ 19:23 వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.