Logo

నిర్గమకాండము అధ్యాయము 3 వచనము 7

నిర్గమకాండము 2:23 ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టిపనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టిపనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.

నిర్గమకాండము 2:24 కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.

నిర్గమకాండము 2:25 దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.

నిర్గమకాండము 22:23 వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.

ఆదికాండము 29:32 లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.

1సమూయేలు 9:16 ఎట్లనగానా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.

కీర్తనలు 22:24 ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.

కీర్తనలు 34:4 నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.

కీర్తనలు 34:6 ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.

కీర్తనలు 106:44 అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.

కీర్తనలు 145:19 తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.

యెషయా 63:9 వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.

హెబ్రీయులకు 4:15 మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

నిర్గమకాండము 1:11 కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టిపనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.

ఆదికాండము 18:21 నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.

కీర్తనలు 142:3 నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.

ఆదికాండము 4:10 అప్పుడాయన నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.

ఆదికాండము 16:11 మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;

ఆదికాండము 21:17 దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచి హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు;

ఆదికాండము 29:31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.

ఆదికాండము 30:17 దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను.

ఆదికాండము 31:12 అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని

ఆదికాండము 31:42 నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టిచేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నాచేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.

నిర్గమకాండము 2:11 ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.

నిర్గమకాండము 2:25 దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.

నిర్గమకాండము 3:9 ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని.

నిర్గమకాండము 4:31 మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.

నిర్గమకాండము 6:5 ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను.

నిర్గమకాండము 11:6 అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.

లేవీయకాండము 25:43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము.

సంఖ్యాకాండము 20:16 మేము యెహోవాకు మొఱపెట్టగా ఆయన మా మొఱనువిని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.

ద్వితియోపదేశాకాండము 15:9 విడుదల సంవత్సరమైన యేడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యకపోయినయెడల వాడొకవేళ నిన్నుగూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును.

న్యాయాధిపతులు 2:1 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెనునేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.

2సమూయేలు 7:23 నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములోనుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది.

2సమూయేలు 16:12 యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో.

2సమూయేలు 22:7 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.

2సమూయేలు 22:28 శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు

2రాజులు 13:4 అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజుచేత బాధనొందిన ఇశ్రాయేలువారిని కనికరించి అతని మనవి నంగీకరించెను.

2రాజులు 13:23 గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టకయుండెను.

2రాజులు 14:26 ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.

1దినవృత్తాంతములు 17:21 నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి

నెహెమ్యా 5:1 తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదు చేసిరి.

నెహెమ్యా 9:9 నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.

యోబు 10:15 నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

యోబు 34:28 బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.

యోబు 35:9 అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.

కీర్తనలు 9:12 ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును వారి మొఱ్ఱను ఆయన మరువడు.

కీర్తనలు 12:5 బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

కీర్తనలు 35:22 యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.

కీర్తనలు 102:20 చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును

కీర్తనలు 107:13 కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను

కీర్తనలు 119:153 (రేష్‌) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము

యెషయా 5:7 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

యెషయా 19:20 అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.

యెషయా 52:5 నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది

యెషయా 54:11 ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును

యెషయా 63:8 వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను.

విలాపవాక్యములు 1:9 దాని యపవిత్రత దాని చెంగులమీదనున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకముచేసికొనక యుండెను అది ఎంతోవింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము.

విలాపవాక్యములు 3:32 ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.

యెహెజ్కేలు 16:6 అయితే నేను నీయొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని.

దానియేలు 9:18 నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరు పెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.

జెకర్యా 9:8 నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను.

అపోస్తలులకార్యములు 7:34 ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చి యున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను.

ప్రకటన 11:8 వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండును; వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువు కూడ సిలువవేయబడెను.