Logo

నిర్గమకాండము అధ్యాయము 8 వచనము 20

నిర్గమకాండము 7:15 ప్రొద్దున నీవు ఫరోయొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని

నిర్గమకాండము 8:1 యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరోయొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము;

నిర్గమకాండము 7:16 అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీయొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి.

నిర్గమకాండము 9:1 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరోయొద్దకు వెళ్లి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.

నిర్గమకాండము 9:13 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.

యిర్మియా 25:3 ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచు వచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.