Logo

నిర్గమకాండము అధ్యాయము 12 వచనము 35

నిర్గమకాండము 3:21 జనులయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు.

నిర్గమకాండము 3:22 ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండినగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.

నిర్గమకాండము 11:2 కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.

నిర్గమకాండము 11:3 యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.

ఆదికాండము 15:14 వారు నాలుగువందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.

కీర్తనలు 105:37 అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను.

ఆదికాండము 24:53 తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.

ఆదికాండము 30:39 మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను.

నిర్గమకాండము 32:2 అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా

న్యాయాధిపతులు 8:24 మరియు గిద్యోనుమీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.

1సమూయేలు 6:4 ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారు మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.

2దినవృత్తాంతములు 20:25 యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొనిపోగలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడు దినములు పట్టెను.

కీర్తనలు 74:14 మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.

ప్రసంగి 3:6 వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు;

ప్రకటన 12:16 భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.