Logo

నిర్గమకాండము అధ్యాయము 20 వచనము 8

నిర్గమకాండము 16:23 అందుకు అతడు యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను

నిర్గమకాండము 16:24 మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.

నిర్గమకాండము 16:25 మోషే నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు.

నిర్గమకాండము 16:26 ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతిదినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను.

నిర్గమకాండము 16:27 అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకకపోయెను.

నిర్గమకాండము 16:28 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?

నిర్గమకాండము 16:29 చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచియుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలువెళ్లకూడదనెను.

నిర్గమకాండము 16:30 కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.

నిర్గమకాండము 31:13 మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును.

నిర్గమకాండము 31:14 కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

ఆదికాండము 2:3 కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.

లేవీయకాండము 19:3 మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.

లేవీయకాండము 23:3 ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతిదినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.

యెషయా 56:4 నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యెషయా 56:5 నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

యెషయా 56:6 విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను

నిర్గమకాండము 13:3 మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహుబలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు.

నిర్గమకాండము 23:12 ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరక యుండవలెను.

లేవీయకాండము 23:38 ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసికొనిరావలెను.

సంఖ్యాకాండము 15:32 ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి.

సంఖ్యాకాండము 28:9 విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.

ద్వితియోపదేశాకాండము 5:12 నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుము.

నెహెమ్యా 9:14 వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.

నెహెమ్యా 13:15 ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానావిధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొనివచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.

యెషయా 58:13 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

యిర్మియా 17:22 విశ్రాంతిదినమున మీ యిండ్లలోనుండి యే బరువును మోసికొనిపోకుడి, యే పనియు చేయకుడి, నేను మీ పితరుల కాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి.

యెహెజ్కేలు 20:12 మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతిదినములను వారికి సూచనగా నేను నియమించితిని.

ఆమోసు 8:5 తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొనువారలారా,

లూకా 23:56 తిరిగివెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.

యోహాను 5:10 ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.