Logo

నిర్గమకాండము అధ్యాయము 22 వచనము 16

ఆదికాండము 34:2 ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.

ఆదికాండము 34:3 అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనామీదనే ఉండెను; అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి

ఆదికాండము 34:4 ఈ చిన్నదాని నాకు పెండ్లిచేయుమని తన తండ్రియైన హమోరును అడిగెను.

ద్వితియోపదేశాకాండము 22:28 ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడినయెడల

ద్వితియోపదేశాకాండము 22:29 ఆమెతో శయనించినవాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది వెండిరూకలిచ్చి ఆమెను పెండ్లిచేసికొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు.

ఆదికాండము 29:18 యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.

ఆదికాండము 34:12 ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి; మీరు అడిగినంత యిచ్చెదను; మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోను ఆమె సహోదరులతోను చెప్పెను.

1సమూయేలు 18:25 అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను.

సామెతలు 30:19 బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచు జాడ, కన్యకతో పురుషుని జాడ.