Logo

నిర్గమకాండము అధ్యాయము 25 వచనము 5

నిర్గమకాండము 26:14 మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను.

నిర్గమకాండము 26:15 మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.

నిర్గమకాండము 26:26 తుమ్మకఱ్ఱతో అడ్డకఱ్ఱలను చేయవలెను. మందిరము యొక్క ఒకప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును

నిర్గమకాండము 26:37 ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను.

నిర్గమకాండము 27:1 మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు.

నిర్గమకాండము 36:20 మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.

నిర్గమకాండము 35:9 ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొనిరావలెను.

సంఖ్యాకాండము 33:49 వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.

ద్వితియోపదేశాకాండము 10:3 కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతిపలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ యెక్కితిని.

యెహెజ్కేలు 16:10 విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని.