Logo

నిర్గమకాండము అధ్యాయము 35 వచనము 17

నిర్గమకాండము 27:9 మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.

నిర్గమకాండము 27:10 దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

నిర్గమకాండము 27:11 అట్లే పొడుగులో ఉత్తరదిక్కున నూరు మూరల పొడుగు గల యవనికలుండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దులును వెండివి

నిర్గమకాండము 27:12 పడమటిదిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది.

నిర్గమకాండము 27:13 తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.

నిర్గమకాండము 27:14 ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

నిర్గమకాండము 27:15 రెండవ ప్రక్కను పరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.

నిర్గమకాండము 27:16 ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.

నిర్గమకాండము 27:17 ఆవరణము చుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.

నిర్గమకాండము 27:18 ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబది మూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.

నిర్గమకాండము 27:19 మందిర సంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.

నిర్గమకాండము 38:9 మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను.

నిర్గమకాండము 38:10 వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

నిర్గమకాండము 38:11 ఉత్తరదిక్కుననున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

నిర్గమకాండము 38:12 పడమటిదిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

నిర్గమకాండము 38:13 తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;

నిర్గమకాండము 38:14 ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

నిర్గమకాండము 38:15 అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

నిర్గమకాండము 38:16 ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నియు పేనిన సన్ననారవి.

నిర్గమకాండము 38:17 స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్పబడెను.

నిర్గమకాండము 38:18 ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు.

నిర్గమకాండము 38:19 వాటి స్తంభములు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి వంకులు వెండివి.

నిర్గమకాండము 38:20 వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను, వాటి పెండెబద్దలు వెండివి, మందిరమునకును దాని చుట్టునున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నియు ఇత్తడివి.

2సమూయేలు 7:2 నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా

యెహెజ్కేలు 40:14 అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను.