Logo

నిర్గమకాండము అధ్యాయము 37 వచనము 7

1రాజులు 6:23 మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను;

1రాజులు 6:24 ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు.

1రాజులు 6:25 రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగియుండెను.

1రాజులు 6:26 ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను.

1రాజులు 6:27 అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొనియుండెను.

1రాజులు 6:28 ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.

1రాజులు 6:29 మరియు మందిరపు గోడలన్నిటిమీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను.

కీర్తనలు 80:1 ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.

కీర్తనలు 104:4 వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను2 తనకు పరిచారకులుగాను ఆయన చేసికొనియున్నాడు.

యెహెజ్కేలు 10:2 అప్పుడు అవిసెనారబట్ట ధరించుకొనినవానితో యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికిపోయెను.

నిర్గమకాండము 25:18 మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.

సంఖ్యాకాండము 8:4 ఆ దీపవృక్షము బంగారు నకిషిపని గలది; అది దాని స్తంభము మొదలుకొని పుష్పములవరకు నకిషిపని గలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను.

1రాజులు 7:29 జవల మధ్యనున్న ప్రక్క పలకలమీద సింహములును ఎడ్లును కెరూబులును ఉండెను; మరియు జవలమీద ఆలాగుండెను; సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండలవంటి పని కలిగియుండెను.