Logo

నిర్గమకాండము అధ్యాయము 38 వచనము 2

నిర్గమకాండము 27:2 దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.

యోబు 6:12 నా బలము రాళ్ల బలమువంటిదా? నా శరీరము ఇత్తడిదా?

నిర్గమకాండము 29:12 ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను.

1రాజులు 1:50 అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.

కీర్తనలు 118:27 యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు ననుగ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.

యెహెజ్కేలు 43:16 దేవాగ్ని గుండము పండ్రెండు మూరల కొలతగలదై చచ్చౌకముగా నుండెను.