Logo

లూకా అధ్యాయము 5 వచనము 5

మత్తయి 17:27 అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరుకును; దానిని తీసికొని నాకొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను

యోహాను 21:6 లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయన దోనె కుడిప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.

యెహెజ్కేలు 47:10 మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లాయీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.

మార్కు 1:16 ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

అపోస్తలులకార్యములు 21:1 మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితివిు.