Logo

లూకా అధ్యాయము 5 వచనము 37

మత్తయి 9:16 ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును.

మత్తయి 9:17 మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పెను.

మార్కు 2:21 ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసినయెడల ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును.

మార్కు 2:22 ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను.

లేవీయకాండము 19:19 మీరు నాకట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతరజాతి జంతువులను కలియనీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసికొనకూడదు.

ద్వితియోపదేశాకాండము 22:11 ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొనకూడదు.

2కొరిందీయులకు 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.