Logo

లూకా అధ్యాయము 8 వచనము 27

మత్తయి 8:28 ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలోనుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేకపోయెను.

మత్తయి 8:29 వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.

మత్తయి 8:30 వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా

మత్తయి 8:31 ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్లగొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.

మత్తయి 8:32 ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడి చచ్చెను.

మత్తయి 8:33 వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి.

మత్తయి 8:34 ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి.

మార్కు 5:1 వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి.

మార్కు 5:2 ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయనకెదురు పడెను.

మార్కు 5:3 వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను.

మార్కు 5:4 పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లువేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను.

మార్కు 5:5 వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచునుండెను.

మార్కు 5:6 వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి

మార్కు 5:7 యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలువేసెను.

మార్కు 5:8 ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను.

మార్కు 5:9 మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి

మార్కు 5:10 తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.

మార్కు 5:11 అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను.

మార్కు 5:12 గనుక ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.

మార్కు 5:13 యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండువేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను.

మార్కు 5:14 ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.

మార్కు 5:15 జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి.

మార్కు 5:16 జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా

మార్కు 5:17 తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి.

మార్కు 5:18 ఆయన దోనె యెక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని

మార్కు 5:19 ఆయన వానికి సెలవియ్యక నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను.

మార్కు 5:20 వాడు వెళ్లి, యేసు తనకు చేసినవన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.