Logo

లూకా అధ్యాయము 8 వచనము 53

ఆదికాండము 23:2 శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెనుగూర్చి యేడ్చుటకును వచ్చెను.

ఆదికాండము 27:34 ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.

ఆదికాండము 27:35 అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.

2సమూయేలు 18:33 అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి యేడ్చుచు, సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.

యిర్మియా 9:17 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.

యిర్మియా 9:18 మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.

యిర్మియా 9:19 మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడుచున్నది.

యిర్మియా 9:20 స్త్రీలారా, యెహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

యిర్మియా 9:21 వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.

నిర్గమకాండము 24:17 యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను.

జెకర్యా 12:10 దావీదు సంతతివారి మీదను యెరూషలేము నివాసులమీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

మార్కు 5:38 సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి

మార్కు 5:39 లోపలికిపోయి మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను.

యోహాను 11:4 యేసు అది విని యీ వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదుగాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.

యోహాను 11:11 ఆయన యీ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా

యోహాను 11:12 శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.

యోహాను 11:13 యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతినిగూర్చి చెప్పెననుకొనిరి.

2రాజులు 4:32 ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచముమీద పెట్టబడియుండుట చూచి

లూకా 7:12 ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడ ఉండిరి.

లూకా 7:13 ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి--ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.

1దెస్సలోనీకయులకు 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్న వారినిగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.

ప్రకటన 5:5 ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.