Logo

లూకా అధ్యాయము 12 వచనము 17

ఆదికాండము 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.

ఆదికాండము 26:13 అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమక్రమముగా అభివృద్ధిపొందుచు వచ్చెను.

ఆదికాండము 26:14 అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.

ఆదికాండము 41:47 సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.

ఆదికాండము 41:48 ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆ యా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను.

ఆదికాండము 41:49 యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్య మాయెను గనుక కొలుచుట మానివేసెను.

యోబు 12:6 దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగానుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.

కీర్తనలు 73:3 భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.

కీర్తనలు 73:12 ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.

హోషేయ 2:8 దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను.

మత్తయి 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.

అపోస్తలులకార్యములు 14:17 అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుట చేత తన్నుగూర్చి సాక్ష్యము లేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి

యోబు 21:10 వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఈనును.

యోబు 24:23 ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టినుంచును

కీర్తనలు 73:7 క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలైయున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి

కీర్తనలు 144:13 మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి.

సామెతలు 1:32 జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.

ప్రసంగి 5:13 సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును.

యెషయా 5:8 స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ.

యెహెజ్కేలు 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను.

యెహెజ్కేలు 28:5 నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకముచేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి.

మలాకీ 3:10 నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మార్కు 10:24 ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;

లూకా 1:53 ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

లూకా 16:19 ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.

యాకోబు 1:11 సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.

యాకోబు 5:1 ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి.