Logo

లూకా అధ్యాయము 12 వచనము 29

యెషయా 40:6 ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది

1పేతురు 1:24 గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

లూకా 8:25 అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి

మత్తయి 8:26 అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను.

మత్తయి 14:31 వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

మత్తయి 16:8 యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?

మత్తయి 17:17 అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.

మత్తయి 17:20 అందుకాయన మీ అల్పవిశ్వాసముచేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును;

మత్తయి 6:30 నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.

లూకా 9:3 మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొనిపోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు.

హెబ్రీయులకు 9:14 నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.