Logo

లూకా అధ్యాయము 20 వచనము 22

కీర్తనలు 12:2 అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.

కీర్తనలు 55:21 వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.

యిర్మియా 42:2 మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము.

యిర్మియా 42:3 మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక.

మత్తయి 22:16 బోధకుడా, నీవు సత్యవంతుడవైయుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.

మత్తయి 26:49 వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.

మత్తయి 26:50 యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.

మార్కు 12:14 వారు వచ్చి బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మేమెరుగుదుము; నీవు మోమోటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా?

యోహాను 3:2 అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను

2కొరిందీయులకు 2:17 కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవుని యెదుట బోధించుచున్నాము.

గలతీయులకు 1:10 ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

1దెస్సలోనీకయులకు 2:4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము.

1దెస్సలోనీకయులకు 2:5 మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.

2దినవృత్తాంతములు 19:7 యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

యోబు 34:19 రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వానితోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?

అపోస్తలులకార్యములు 10:34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.

అపోస్తలులకార్యములు 10:35 ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.

గలతీయులకు 2:6 ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.

ద్వితియోపదేశాకాండము 1:17 తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతిగాని పక్షపాతములేకుండ వినవలెను; న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యెమును నాయొద్దకు తీసికొనిరావలెను; నేను దానిని విచారించెదనని వారికాజ్ఞాపించితిని.

కీర్తనలు 38:12 నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.

సామెతలు 10:18 అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.

సామెతలు 26:28 అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.

సామెతలు 29:5 తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.

మలాకీ 2:6 సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.

మత్తయి 2:8 మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.

లూకా 7:40 అందుకు యేసు సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు బోధకుడా, చెప్పుమనెను.

అపోస్తలులకార్యములు 16:17 ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.

రోమీయులకు 2:11 దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;

రోమీయులకు 13:6 ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.

కొలొస్సయులకు 3:25 అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతముండదు.

1తిమోతి 5:21 విరోధబుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియు చేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవ దూతల యెదుటను నీకు ఆనబెట్టుచున్నాను.