Logo

లూకా అధ్యాయము 20 వచనము 40

మత్తయి 22:34 ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడివచ్చిరి.

మత్తయి 22:35 వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు

మత్తయి 22:36 బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.

మత్తయి 22:37 అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే.

మత్తయి 22:38 ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.

మత్తయి 22:39 నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.

మత్తయి 22:40 ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.

మార్కు 12:28 శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను.

మార్కు 12:29 అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.

మార్కు 12:30 నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ.

మార్కు 12:31 రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను

మార్కు 12:32 ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.

మార్కు 12:33 పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగహోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను.

మార్కు 12:34 అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

అపోస్తలులకార్యములు 23:9 కలహమెక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొనిరండని సైనికులకు ఆజ్ఞాపించెను.

యిర్మియా 1:12 యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాననెను.

మత్తయి 22:33 జనులది విని ఆయన బోధకాశ్చర్యపడిరి.

లూకా 20:26 వారు ప్రజల యెదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.