Logo

లూకా అధ్యాయము 22 వచనము 24

మత్తయి 26:22 అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా, నేనా? అని ఆయననడుగగా

మార్కు 14:19 వారు దుఃఖపడి నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.

యోహాను 13:22 ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా

యోహాను 13:23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను

యోహాను 13:24 గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను.

యోహాను 13:25 అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను.

కీర్తనలు 2:1 అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

మత్తయి 20:24 తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి