Logo

లూకా అధ్యాయము 22 వచనము 46

మత్తయి 26:40 ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియయైనను నాతోకూడ మేల్కొని యుండలేరా?

మత్తయి 26:43 తిరిగివచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.

మార్కు 14:37 మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొని యుండలేవా?

మార్కు 14:40 ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు.

మార్కు 14:41 ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు;

1రాజులు 8:54 సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశముతట్టు తనచేతులను చాపి, యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్లూనుట మాని, లేచి నిలిచిన తరువాత

దానియేలు 8:18 అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.

దానియేలు 10:9 నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.

యోనా 1:5 కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢనిద్ర పోయియుండెను

జెకర్యా 4:1 నాతో మాటలాడుచున్న దూత తిరిగివచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్నులేపి

మార్కు 13:36 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.

లూకా 9:32 పేతురును అతనితో కూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతో కూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి.

యోహాను 16:6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము ధుఃఖముతో నిండియున్నది.

యోహాను 16:20 మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.