Logo

1సమూయేలు అధ్యాయము 20 వచనము 5

1సమూయేలు 20:6 ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చుకొనెను.

సంఖ్యాకాండము 10:10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలులనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

సంఖ్యాకాండము 28:11 నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,

2రాజులు 4:23 అతడు నేడు అమావాస్య కాదే; విశ్రాంతిదినము కాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి

కీర్తనలు 81:3 అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి.

కొలొస్సయులకు 2:16 కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పుతీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.

1సమూయేలు 20:19 నీవు మూడు దినములు ఆగి, యీ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్లి ఏసెలు అనుబండ దగ్గర నుండుము

1సమూయేలు 19:2 సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతొ ఇట్లనెను నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీద నున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము.

కీర్తనలు 55:12 నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.

సామెతలు 22:3 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు.

యోహాను 8:59 కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను.

అపోస్తలులకార్యములు 17:14 వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.

1సమూయేలు 20:18 మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను రేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా;