Logo

1సమూయేలు అధ్యాయము 20 వచనము 15

1సమూయేలు 24:21 కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను

2సమూయేలు 9:1 యోనాతానునుబట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైన కలడాయని దావీదు అడిగెను.

2సమూయేలు 9:2 సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవేగదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను.

2సమూయేలు 9:3 రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడా యని అతని నడుగగా సీబా యోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవిచేసెను.

2సమూయేలు 9:4 అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను.

2సమూయేలు 9:5 అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పించెను.

2సమూయేలు 9:6 సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతూ అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.

2సమూయేలు 9:7 అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువని సెలవియ్యగా

2సమూయేలు 21:7 తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసియున్న హేతువుచేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక

ఆదికాండము 40:14 కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము.

యెహోషువ 2:12 నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి

1సమూయేలు 20:23 అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి.