Logo

1సమూయేలు అధ్యాయము 20 వచనము 27

1సమూయేలు 18:11 ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.

1సమూయేలు 19:9 యెహోవా యొద్దనుండి దురాత్మ సౌలుమీదికి వచ్చెను. సౌలు ఈటెచేత పట్టుకొని యింట కూర్చుండి యుండెను. దావీదు సితారా వాయించుచుండగా

1సమూయేలు 19:10 సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము గలిగి యీటె విసిరెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను.

1సమూయేలు 19:15 దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొనిరండని వారితో చెప్పగా

1సమూయేలు 22:7 సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా?

1సమూయేలు 22:8 మీరెందుకు నామీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే.

1సమూయేలు 22:9 అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని.

1సమూయేలు 22:13 సౌలు నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా

1సమూయేలు 22:14 అహీమెలెకు రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు?

1సమూయేలు 25:10 నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు.

యెషయా 11:1 యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును

యెషయా 11:2 యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును

మత్తయి 13:55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా యనువారు ఇతని సోదరులు కారా?

1పేతురు 2:4 మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,

2దినవృత్తాంతములు 10:16 రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు దావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీ గుడారమునకు పోవుడి; దావీదూ, నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి.