Logo

ఆదికాండము అధ్యాయము 36 వచనము 9

ఆదికాండము 19:37 వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.

ఆదికాండము 2:4 దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.

ఆదికాండము 25:30 నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱ యెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.

1దినవృత్తాంతములు 1:35 ఏశావు కుమారులు ఏలీఫజు రెయూవేలు యెయూషు యాలాము కోరహు.

1దినవృత్తాంతములు 4:42 షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధిపతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి

2దినవృత్తాంతములు 20:23 అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.

ప్రసంగి 1:4 తరము వెంబడి తరము గతించిపోవుచున్నది; భూమి యొకటే యెల్లప్పుడును నిలుచునది.

యెహెజ్కేలు 35:2 నరపుత్రుడా, శేయీరు పర్వతమువైపు నీ ముఖము త్రిప్పుకొని