Logo

ఆదికాండము అధ్యాయము 36 వచనము 24

లేవీయకాండము 19:19 మీరు నాకట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతరజాతి జంతువులను కలియనీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసికొనకూడదు.

ద్వితియోపదేశాకాండము 2:10 పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నతదేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడినవారు.

2సమూయేలు 13:29 అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పున వారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.

2సమూయేలు 18:9 అబ్షాలోము కంచరగాడిదమీద ఎక్కిపోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను; ఆ కంచరగాడిద యొక గొప్పమస్తకి వృక్షముయొక్క చిక్కుకొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను.

1రాజులు 1:38 కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచర గాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొనిరాగా

1రాజులు 1:44 రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచర గాడిదమీద అతని నూరేగించిరి;

1రాజులు 4:28 మరియు గుఱ్ఱములును పాటుపశువులును ఉన్న ఆ యా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.

జెకర్యా 14:15 ఆలాగుననే గుఱ్ఱముల మీదను కంచరగాడిదల మీదను ఒంటెల మీదను గార్దభముల మీదను దండుపాళెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్లు పడును.

1రాజులు 10:25 ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.

1దినవృత్తాంతములు 1:40 శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.