Logo

ఆదికాండము అధ్యాయము 36 వచనము 30

2రాజులు 11:19 అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయు వారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములో నున్న రాజును తీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.

యెషయా 23:15 ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా

దానియేలు 7:17 ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.

దానియేలు 7:23 నేనడగినదానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును.

ఆదికాండము 36:43 మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.

యెహోషువ 12:7 యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను.

1దినవృత్తాంతములు 1:38 శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.