Logo

ఆదికాండము అధ్యాయము 36 వచనము 15

ఆదికాండము 36:18 వీరు ఏశావు భార్యయైన అహొలీబామా కుమారులు, యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు; వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యయునైన అహొలీబామా పుత్రసంతానపు నాయకులు.

1దినవృత్తాంతములు 1:35 ఏశావు కుమారులు ఏలీఫజు రెయూవేలు యెయూషు యాలాము కోరహు.

యోబు 21:8 వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.

కీర్తనలు 37:35 భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను.

ఆదికాండము 36:4 ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.

ఆదికాండము 36:11 ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని.

ఆదికాండము 36:12 ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు.

1దినవృత్తాంతములు 1:36 ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.

1దినవృత్తాంతములు 1:45 యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపువాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.

1దినవృత్తాంతములు 1:51 హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,

1దినవృత్తాంతములు 1:52 అహలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,

1దినవృత్తాంతములు 1:53 కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,

1దినవృత్తాంతములు 1:54 మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు; వీరు ఎదోము దేశమునకు నాయకులు.

యోబు 2:11 తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినిగూర్చి వినిన వారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచివచ్చిరి.

యోబు 4:1 దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

యిర్మియా 49:7 సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?

యిర్మియా 49:20 ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాసస్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.

యెహెజ్కేలు 25:13 ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువులేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడుచేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

ఆమోసు 1:12 తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేయును.

ఓబధ్యా 1:9 తేమానూ, నీ బలాఢ్యులు విస్మయమొందుదురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరు హతులై నిర్మూలమగుదురు.

హబక్కూకు 3:3 దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయుచున్నాడు.(సెలా.) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.

ఆదికాండము 36:34 యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను.

ఆదికాండము 36:40 మరియు వారివారి వంశముల ప్రకారము వారివారి స్థలములలో వారివారి పేరుల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు

ఆదికాండము 36:43 మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.