Logo

లేవీయకాండము అధ్యాయము 15 వచనము 16

లేవీయకాండము 15:5 వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 22:4 అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమైనను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును,

ద్వితియోపదేశాకాండము 23:10 రాత్రి జరిగినదానివలన మైలపడినవాడు మీలో ఉండినయెడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను.

ద్వితియోపదేశాకాండము 23:11 అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును.

2కొరిందీయులకు 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.

1పేతురు 2:11 ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,

1యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును

1సమూయేలు 20:26 అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండునేమో, అతడు అపవిత్రుడై యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు.