Logo

లేవీయకాండము అధ్యాయము 15 వచనము 17

లేవీయకాండము 7:8 ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది; అది అతనిదగును.

సంఖ్యాకాండము 31:23 అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలోవేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను.

ద్వితియోపదేశాకాండము 23:11 అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును.

1సమూయేలు 20:26 అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండునేమో, అతడు అపవిత్రుడై యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు.