Logo

లేవీయకాండము అధ్యాయము 16 వచనము 16

లేవీయకాండము 16:18 మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి

లేవీయకాండము 8:15 దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను.

నిర్గమకాండము 29:36 ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలినర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను.

నిర్గమకాండము 29:37 ఏడు దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.

యెహెజ్కేలు 45:18 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసికొని పరిశుద్ధస్థలము నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింపవలెను.

యెహెజ్కేలు 45:19 ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తము కొంచెము తీసి, మందిరపు ద్వారబంధములమీదను బలిపీఠవు చూరు నాలుగు మూలలమీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధములమీదను ప్రోక్షింపవలెను.

యోహాను 14:3 నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును.

హెబ్రీయులకు 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.

హెబ్రీయులకు 9:23 పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులవలన శుద్ధిచేయబడవలసి యుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడవలసి యుండెను.

లేవీయకాండము 16:20 అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొనిరావలెను.

లేవీయకాండము 16:33 మరియు అతడు అతిపరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను.

సంఖ్యాకాండము 8:12 లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి

హెబ్రీయులకు 9:13 ఏలయనగా మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,