Logo

లేవీయకాండము అధ్యాయము 16 వచనము 24

లేవీయకాండము 16:4 అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.

లేవీయకాండము 8:6 అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను.

లేవీయకాండము 14:9 ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.

లేవీయకాండము 22:6 అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొనువరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు.

నిర్గమకాండము 29:4 మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి

హెబ్రీయులకు 9:10 ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి.

హెబ్రీయులకు 10:19 సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

హెబ్రీయులకు 10:20 ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,

హెబ్రీయులకు 10:21 దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,

హెబ్రీయులకు 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

ప్రకటన 1:5 నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

లేవీయకాండము 8:7 తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదుయొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి

లేవీయకాండము 8:8 ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి

లేవీయకాండము 8:9 అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధకిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

నిర్గమకాండము 28:4 పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.

నిర్గమకాండము 28:5 వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారను తీసికొని

నిర్గమకాండము 28:6 బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలెను.

నిర్గమకాండము 28:7 రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడి యుండును.

నిర్గమకాండము 28:8 మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.

నిర్గమకాండము 28:9 మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమము చొప్పున

నిర్గమకాండము 28:10 ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నముమీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.

నిర్గమకాండము 28:11 ముద్రమీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.

నిర్గమకాండము 28:12 అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును

నిర్గమకాండము 28:13 మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;

నిర్గమకాండము 28:14 సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.

నిర్గమకాండము 29:5 ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి

లేవీయకాండము 16:3 అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.

లేవీయకాండము 16:5 మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొనిరావలెను.

లేవీయకాండము 16:17 పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.

లేవీయకాండము 1:4 అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును.

లేవీయకాండము 6:11 తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొనిపోవలెను.

లేవీయకాండము 16:33 మరియు అతడు అతిపరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను.

లేవీయకాండము 23:27 ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.