Logo

లేవీయకాండము అధ్యాయము 26 వచనము 12

ఆదికాండము 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగుకొనగా

ఆదికాండము 5:22 హనోకు మెతూషెలను కనిన తరువాత మూడువందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

ఆదికాండము 6:9 నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.

ద్వితియోపదేశాకాండము 23:14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్థముగా ఉండవలెను.

2కొరిందీయులకు 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.

ప్రకటన 2:1 ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా

ఆదికాండము 17:7 నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాతవారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

నిర్గమకాండము 3:6 మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.

నిర్గమకాండము 6:7 మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనైయుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు.

నిర్గమకాండము 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.

నిర్గమకాండము 19:6 సమస్త భూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా

కీర్తనలు 50:7 నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను

కీర్తనలు 68:18 నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొనిపోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసికొనియున్నావు.

కీర్తనలు 68:19 ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయైయున్నాడు.

కీర్తనలు 68:20 దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడైయున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.

యెషయా 12:2 ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను

యెషయా 41:10 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.

యిర్మియా 7:23 ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనైయుందును మీరు నాకు జనులైయుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞాపించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.

యిర్మియా 11:4 ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.

యిర్మియా 30:22 అప్పుడు మీరు నాకు ప్రజలైయుందురు నేను మీకు దేవుడనైయుందును.

యిర్మియా 31:33 ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

యిర్మియా 32:38 వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనైయుందును.

యెహెజ్కేలు 11:20 అప్పుడు వారు నాకు జనులైయుందురు నేను వారికి దేవుడనైయుందును.

యెహెజ్కేలు 36:38 నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు ప్రతిష్ఠితములగు గొఱ్ఱలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱలంత విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను.

యోవేలు 2:27 అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు; నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందక యుందురు.

జెకర్యా 13:9 ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.

మత్తయి 22:32 ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను.

హెబ్రీయులకు 11:16 అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్దపరచియున్నాడు

ప్రకటన 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనైయుందును అతడు నాకు కుమారుడై యుండును.

ఆదికాండము 17:8 నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

నిర్గమకాండము 29:45 నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనైయుందును.

లేవీయకాండము 5:15 ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపము చేసినయెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలోనుండి అపరాధపరిహారార్థబలిగా యెహోవాయొద్దకు వాడు తీసికొనిరావలెను.

సంఖ్యాకాండము 5:3 నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను.

యెహోషువ 22:31 అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోను గాదీయులతోను మనష్షీయులతోనుమీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము; ఇప్పుడు మీరు యెహోవాచేతిలోనుండి ఇశ్రాయేలీయులను విడిపించి యున్నారని చెప్పెను.

2సమూయేలు 7:7 ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా?

1దినవృత్తాంతములు 17:6 నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నాకొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమి యని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటయైన పలికియుంటినా?

యిర్మియా 14:9 భ్రమసియున్నవానివలెను రక్షింపలేని శూరునివలెను నీవేల ఉన్నావు? యెహోవా, నీవు మామధ్య నున్నావే; మేము నీ పేరుపెట్టబడినవారము; మమ్మును చెయ్యి విడువకుము.

యిర్మియా 31:1 యెహోవా వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనైయుందును, వారు నాకు ప్రజలైయుందురు.

యిర్మియా 52:19 మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.

యెహెజ్కేలు 37:26 నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను.

యెహెజ్కేలు 37:27 నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనైయుందును వారు నా జనులైయుందురు.

జెకర్యా 2:10 సీయోను నివాసులారా, నేను వచ్చి మీమధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.

జెకర్యా 8:8 యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనైయుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.

ప్రకటన 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.