Logo

లేవీయకాండము అధ్యాయము 26 వచనము 38

ద్వితియోపదేశాకాండము 4:27 మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.

ద్వితియోపదేశాకాండము 28:48 గనుక ఆకలిదప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.

ద్వితియోపదేశాకాండము 28:68 మరియు నీవు మరిఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపు కొనువారుందురు గాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.

యెషయా 27:13 ఆ దినమున పెద్ద బూర ఊదబడును అష్షూరు దేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును, వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు.

యిర్మియా 42:17 నేను వారిమీదికి రప్పించు కీడునుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు, ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకొను మనుష్యులందరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను నిశ్శేషముగా చత్తురు.

యిర్మియా 42:18 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా కోప మును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు.

యిర్మియా 42:22 కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను చత్తురని నిశ్చయముగా తెలిసికొనుడి.

యిర్మియా 44:12 అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించుకొను యూదాశేషులను నేను తోడుకొనిపోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశింతురు, ఖడ్గము చేతనైనను క్షామముచేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించువారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందినవారుగాను ఉందురు.

యిర్మియా 44:13 యెరూషలేము నివాసులను నేనేలాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గము చేతగాని క్షామము చేతగాని తెగులు చేతగాని శిక్షించెదను.

యిర్మియా 44:14 కావున తాము మరలివచ్చి యూదా దేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.

యిర్మియా 44:27 మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తు దేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.

యిర్మియా 44:28 ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తు దేశములోనుండి యూదా దేశమునకు తిరిగివచ్చెదరు, అప్పడు ఐగుప్తు దేశములో కాపురముండుటకు వెళ్లిన యూదావారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.

ద్వితియోపదేశాకాండము 28:20 నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.

ద్వితియోపదేశాకాండము 32:26 వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండ చేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో

2రాజులు 15:29 ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొనిపోయెను.

2రాజులు 17:6 హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.

యిర్మియా 15:14 నీవెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును.

యెహెజ్కేలు 36:19 వారి ప్రవర్తననుబట్టియు వారి క్రియలనుబట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆ యా దేశములకు చెదరిపోయిరి.

జెకర్యా 11:11 అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని యున్న గొఱ్ఱలు తెలిసికొనెను.