Logo

లేవీయకాండము అధ్యాయము 27 వచనము 4

జెకర్యా 11:12 మీకు అనుకూలమైనయెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి.

జెకర్యా 11:13 యెహోవా యెంతో అబ్బురముగా వారు నాకేర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.

మత్తయి 26:15 నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.

మత్తయి 27:9 అప్పుడు విలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది

మత్తయి 27:10 వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను.

న్యాయాధిపతులు 11:39 ఆ రెండు నెలల అంత మున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.