Logo

లేవీయకాండము అధ్యాయము 27 వచనము 6

సంఖ్యాకాండము 3:40 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము.

సంఖ్యాకాండము 3:41 నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలొ తొలిచూలియైన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసికొనవలెను.

సంఖ్యాకాండము 3:42 కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారినందరిని లెక్కించెను.

సంఖ్యాకాండము 3:43 వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండువేల రెండువందల డెబ్బదిమూడు.

సంఖ్యాకాండము 18:14 ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.

సంఖ్యాకాండము 18:15 మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.

సంఖ్యాకాండము 18:16 అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణమునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు.

సంఖ్యాకాండము 3:47 పరిశుద్ధమైన తులముచొప్పున వాటిని తీసికొనవలెను.