Logo

లేవీయకాండము అధ్యాయము 7 వచనము 15

నిర్గమకాండము 12:10 దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.

నిర్గమకాండము 23:18 నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువ యుండకూడదు.

నిర్గమకాండము 34:25 నీవు పులిసినదానితో నా బలిరక్తమును అర్పింపకూడదు; పస్కా పండుగలోని బలిసంబంధమైన మాంసమును ఉదయకాలమువరకు ఉంచకూడదు.

లేవీయకాండము 8:31 అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనెను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారులును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను.

లేవీయకాండము 22:30 ఆనాడే దాని తినివేయవలెను; మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను.

1సమూయేలు 1:4 ఎల్కానా తాను బల్యర్పణ చేసిననాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచు వచ్చెను గాని

సామెతలు 7:14 సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను