Logo

లేవీయకాండము అధ్యాయము 7 వచనము 20

లేవీయకాండము 15:2 మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలన వాడు అపవిత్రుడగును.

లేవీయకాండము 15:3 వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము;

లేవీయకాండము 15:4 వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము.

లేవీయకాండము 15:5 వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:6 అట్టివాడు దేనిమీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:7 స్రావము గలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:8 స్రావము గలవాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:9 స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.

లేవీయకాండము 15:10 వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:11 స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:12 స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను.

లేవీయకాండము 15:13 స్రావము గలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును.

లేవీయకాండము 15:14 ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను.

లేవీయకాండము 15:15 యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.

లేవీయకాండము 15:16 ఒకనికి వీర్యస్ఖలనమైనయెడల వాడు సర్వాంగస్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:17 ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలమువరకు అపవిత్రమై యుండును.

లేవీయకాండము 15:18 వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు.

లేవీయకాండము 15:19 స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు.

లేవీయకాండము 15:20 ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును.

లేవీయకాండము 15:21 ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:22 ఆమె దేనిమీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:23 అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:24 ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రుడగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.

లేవీయకాండము 15:25 ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలో వలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు.

లేవీయకాండము 15:26 ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండవలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును.

లేవీయకాండము 15:27 వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

లేవీయకాండము 15:28 ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును.

లేవీయకాండము 15:29 ఎనిమిదవనాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను.

లేవీయకాండము 15:30 యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.

లేవీయకాండము 15:31 ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.

లేవీయకాండము 15:32 స్రావము గలవాని గూర్చియు, వీర్యస్ఖలనమువలని అపవిత్రత గలవాని గూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే.

లేవీయకాండము 15:33 స్రావముగల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.

1కొరిందీయులకు 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

ఆదికాండము 17:14 సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.

నిర్గమకాండము 30:33 దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.

లేవీయకాండము 7:21 ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని యే అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలి పశువు మాంసమును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 7:27 ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

లేవీయకాండము 22:3 నీవు వారితో ఇట్లనుము మీ తర తరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించువాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.

సంఖ్యాకాండము 19:13 నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వానికుండును.

ద్వితియోపదేశాకాండము 26:14 నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనైయుండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయినవారి విషయమై దానిలో ఏదియు నేనియ్యలేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను.

నెహెమ్యా 7:65 కాగా అధికారి ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.