Logo

మార్కు అధ్యాయము 15 వచనము 7

మత్తయి 26:2 రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.

మత్తయి 26:5 అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి.

మత్తయి 27:15 జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదలచేయుట అధిపతికి వాడుక.

లూకా 23:16 కాబట్టి నేనితనిని

లూకా 23:17 శిక్షించి విడుదలచేయుదునని వారితో చెప్పగా

యోహాను 18:39 అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.

యోహాను 18:40 అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ.

అపోస్తలులకార్యములు 24:27 రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను.

అపోస్తలులకార్యములు 25:9 అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను.

లూకా 23:25 అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి యుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.