Logo

మార్కు అధ్యాయము 15 వచనము 44

మార్కు 10:23 అప్పుడు యేసు చుట్టు చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను.

మార్కు 10:24 ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;

మార్కు 10:25 ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.

మార్కు 10:26 అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన నడిగిరి.

మార్కు 10:27 యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.

లూకా 2:25 యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.

లూకా 2:38 ఆమె కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయననుగూర్చి మాటలాడుచుండెను.

లూకా 23:51 అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టుచుండినవాడు.

మార్కు 14:54 పేతురు ప్రధానయాజకుని యింటి ముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచుకొనుచుండెను.

మార్కు 14:66 పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధానయాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి

మార్కు 14:67 పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను.

మార్కు 14:68 అందుకతడు ఆయన ఎవడో నేనెరుగను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.

మార్కు 14:69 ఆ పనికత్తె అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్నవారితో మరల చెప్పసాగెను.

మార్కు 14:70 అతడు మరల నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.

మార్కు 14:71 అందుకతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టుబెట్టుకొనుటకును మొదలుపెట్టెను.

మార్కు 14:72 వెంటనే రెండవమారు కోడి కూసెను గనుక కోడి రెండుమారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పినమాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను.

మత్తయి 19:30 మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు.

మత్తయి 20:16 ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.

అపోస్తలులకార్యములు 4:8 పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను ప్రజల అధికారులారా, పెద్దలారా,

అపోస్తలులకార్యములు 4:9 ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక

అపోస్తలులకార్యములు 4:10 మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.

అపోస్తలులకార్యములు 4:11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.

అపోస్తలులకార్యములు 4:12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

అపోస్తలులకార్యములు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.

ఫిలిప్పీయులకు 1:14 మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.

ఆదికాండము 49:18 యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను.

యెషయా 53:9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.

మత్తయి 27:57 యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి

1కొరిందీయులకు 15:4 లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.