Logo

మార్కు అధ్యాయము 15 వచనము 13

మత్తయి 27:22 అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువ వేయుమని అందరును చెప్పిరి.

మత్తయి 27:23 అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

లూకా 23:20 పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.

లూకా 23:21 వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలువేసిరి.

లూకా 23:22 మూడవమారు అతడు ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదలచేతునని వారితో చెప్పెను.

లూకా 23:23 అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.

లూకా 23:24 కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి

యోహాను 19:14 ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా

యోహాను 19:15 అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి

యోహాను 19:16 అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

మార్కు 15:1 ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభ వారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్పగించిరి.

మార్కు 15:2 పిలాతు యూదుల రాజవు నీవేనా? అని ఆయననడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను.

మార్కు 11:9 మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును జయము

మార్కు 11:10 ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

మార్కు 11:11 ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను.

సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

సామెతలు 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.

యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

యెషయా 9:7 ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.

యిర్మియా 23:5 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

యిర్మియా 23:6 అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.

జెకర్యా 9:9 సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.

మత్తయి 2:2 యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి

మత్తయి 2:3 హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

మత్తయి 2:4 కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

మత్తయి 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహకపశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.

లూకా 23:2 ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.

అపోస్తలులకార్యములు 5:31 ఇశ్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలముచేత హెచ్చించియున్నాడు.

యోహాను 19:6 ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలువేయగా పిలాతు ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువ వేయుడని వారితో చెప్పెను.