Logo

సంఖ్యాకాండము అధ్యాయము 1 వచనము 42

ఆదికాండము 30:7 రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.

ఆదికాండము 30:8 అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.

ఆదికాండము 46:24 నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.

ఆదికాండము 49:21 నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును.

సంఖ్యాకాండము 2:29 అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:30 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది.

సంఖ్యాకాండము 26:50 వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబది యయిదువేల నాలుగువందలమంది