Logo

సంఖ్యాకాండము అధ్యాయము 1 వచనము 51

సంఖ్యాకాండము 4:5 దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి

సంఖ్యాకాండము 4:6 దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

సంఖ్యాకాండము 4:7 సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దానిమీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱబట్ట పరచి

సంఖ్యాకాండము 4:8 దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

సంఖ్యాకాండము 4:9 మరియు వారు నీలిబట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెరచిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి

సంఖ్యాకాండము 4:10 దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను.

సంఖ్యాకాండము 4:11 మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టను పరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.

సంఖ్యాకాండము 4:12 మరియు తాము పరిశుద్ధస్థలములో సేవచేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను.

సంఖ్యాకాండము 4:13 వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి

సంఖ్యాకాండము 4:14 దానిమీద తమ సేవోపకరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లుగరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.

సంఖ్యాకాండము 4:15 దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.

సంఖ్యాకాండము 4:16 యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగా దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పైవిచారణలోనికి అతని భారము.

సంఖ్యాకాండము 4:17 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 4:18 మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి.

సంఖ్యాకాండము 4:19 వారు అతిపరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికియుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను.

సంఖ్యాకాండము 4:20 వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.

సంఖ్యాకాండము 4:21 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 4:22 గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము.

సంఖ్యాకాండము 4:23 ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పనిచేయ చేరువారందరిని లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 4:24 పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ;

సంఖ్యాకాండము 4:25 వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను

సంఖ్యాకాండము 4:26 మందిరముచుట్టును బలిపీఠముచుట్టును ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను.

సంఖ్యాకాండము 4:27 గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయువాటినన్నిటిని చేయు పనియంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటిమాటచొప్పున జరుగవలెను. వారు జరుపువాటినన్నిటిని జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను.

సంఖ్యాకాండము 4:28 ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పనిచేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద నుండవలెను.

సంఖ్యాకాండము 4:29 మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 4:30 ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 4:31 ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను

సంఖ్యాకాండము 4:32 దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావలసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.

సంఖ్యాకాండము 4:33 మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.

సంఖ్యాకాండము 10:11 రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరముమీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి.

సంఖ్యాకాండము 10:17 మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి.

సంఖ్యాకాండము 10:18 రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.

సంఖ్యాకాండము 10:19 షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి.

సంఖ్యాకాండము 10:20 గాదీయుల గోత్రసైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.

సంఖ్యాకాండము 10:21 కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచు సాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి.

సంఖ్యాకాండము 3:10 నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష నొందును.

సంఖ్యాకాండము 3:38 మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.

సంఖ్యాకాండము 16:40 కోరహువలెను అతని సమాజమువలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడినవారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను.

సంఖ్యాకాండము 18:22 ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు.

లేవీయకాండము 22:10 అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,

లేవీయకాండము 22:11 అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును.

లేవీయకాండము 22:12 యాజకుని కుమార్తె అన్యునికియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.

లేవీయకాండము 22:13 యాజకుని కుమార్తెలలో విధవరాలేకాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును గాని అన్యుడెవడును దాని తినకూడదు.

1సమూయేలు 6:19 బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి.

2సమూయేలు 6:7 యెహోవా కోపము ఉజ్జామీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.

నిర్గమకాండము 29:33 వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు.

సంఖ్యాకాండము 10:21 కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచు సాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి.

సంఖ్యాకాండము 17:13 యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.

సంఖ్యాకాండము 18:4 వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను.

1రాజులు 13:33 ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.