1దినవృత్తాంతములు 4: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు."
సంబంధిత రిఫరెన్స్‌లు
పెరెసు కుమారులు హెస్రోను హామూలు.
అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె నీవేల భేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను.
యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;
పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు
యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;
నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.
కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.
ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ.
యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.