లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 4: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" యబ్బేజు1 తన సహోదరులకంటె ఘనము పొందినవాడైయుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 34:19

ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు

యెషయా 43:4

నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను.

అపోస్తలులకార్యములు 17:11

వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

1దినవృత్తాంతములు 7:23

తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను; తన యింటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.

ఆదికాండము 3:16

ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

ఆదికాండము 35:18

ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.

1సమూయేలు 4:21

దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు1 అను పేరు పెట్టెను.

1దినవృత్తాంతములు 2:55

యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటివారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.

సామెతలు 23:25

నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.