లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 4: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవాబును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 24:14

అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరును లేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొనిపోయెను.

నెహెమ్యా 11:35

లోదులోను పనివారిలోయ అను ఓనోలోను నివసించిరి.

ఆదికాండము 36:43

మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.

1దినవృత్తాంతములు 4:23

వారు కుమ్మరివాండ్లయి నెతాయీమునందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమముచేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి.