లేఖనాలను అన్వేషించండి

మార్కు 15: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా? అని అడిగెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 27:17

కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని

మత్తయి 27:18

విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను

మత్తయి 27:19

అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతనియొద్దకు వర్తమానము పంపెను

మత్తయి 27:20

ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి

మత్తయి 27:21

అధిపతి ఈ యిద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారినడుగగా వారు బరబ్బనే అనిరి.

యోహాను 18:39

అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.

యోహాను 19:4

పిలాతు మరల వెలుపలికి వచ్చి ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.

యోహాను 19:5

ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.

యోహాను 19:14

ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా

యోహాను 19:15

అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి

యోహాను 19:16

అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

అపోస్తలులకార్యములు 3:13

అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని యెదుట ఆయనను నిరాకరించితిరి

అపోస్తలులకార్యములు 3:14

మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.

అపోస్తలులకార్యములు 3:15

మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.